Thursday, January 23, 2025

స్పై మూవీలో స్టార్ బ్యూటీ

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ ఓ స్పై మూవీని తెరకెక్కించనుందని తెలిసింది. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఇటీవల యశ్‌రాజ్ ఫిలిమ్స్ వారు పఠాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వీరి బ్యానర్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా టైగర్ 3 మూవీ ఈ ఏఢాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది విడుదల కాగానే హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాణిలు ప్రధాన పాత్రలతో వార్ 2 మూవీ నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఈ బ్యానర్‌లో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా కూడా తెరరకెక్కనుంది. ఇది కూడా ఈ ఏడాదే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత అలియాభట్ తో స్పై మూవీని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలిసింది.

Also Read: మెగా ప్రిన్సెస్‌కు లగ్జరీ రూమ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News