Wednesday, January 22, 2025

అలీబాబాలో అనూహ్య మార్పులు

- Advertisement -
- Advertisement -

షాంఘై : చైనాకు చెందిన దిగ్గజ ఇకామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ తన ఉన్నతాధికారుల్లో అనేక మార్పులు చేపట్టింది. కొవిడ్19 మహమ్మారి ఆంక్షలు ముగిసినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో అలీబాబా గ్రూప్ వృద్ధిపై దృష్టిపెట్టింది. ఇ-కామర్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్డీ యోంగ్మింగ్ వు కంపెనీ సిఇఒగా నియమితులవ్వగా, ఆయన ప్రస్తుత డేనియల్ జాంగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు.

జాంగ్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ గ్రూప్‌పై దృష్టి సారిస్తారు. జాంగ్ అలీబాబా గ్రూప్ సిఇఒ, చైర్మన్‌గా అలాగే అలీబాబా క్లౌడ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ సాయ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జాంగ్ 2015లో అలీబాబా సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు జాక్ మా స్థానంలో ఆయన 2019లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

జాంగ్ మాట్లాడుతూ, సంస్థలో మార్పులు చేయడానికి ఇదే సరైన సమయమని, వృద్ధి కోసం రాబోయే నెలల్లో జో, ఎడ్డీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నానని అన్నారు. కంపెనీలో చేసిన ఈ మార్పులు సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. రెండు సంవత్సరాల గందరగోళం తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ ఆరు వేర్వేరు యూనిట్లుగా కంపెనీని పునర్నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రతి యూనిట్‌కి ప్రత్యేక బోర్డు, సిఇఒ ఉంటారు. ఎడ్డీ యోంగ్మింగ్ వు అలీబాబా సహ వ్యవస్థాపకుల్లో ఒకరు, 1999లో కంపెనీ స్థాపించబడినప్పుడు వూ కంపెనీ టెక్నాలజీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News