- Advertisement -
అలీగఢ్: హోలి పండుగను పురస్కరించుకుని అలీగఢ్ మసీదుకు టార్పలిన్ కప్పేశారు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. మసీదుపై రంగులు వేయకుండా ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. శాంతిభద్రల రక్షణకుగాను పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిసింది. అలీగఢ్‌లోని అత్యంత సున్నితమైన కూడలి వద్ద ఉన్న అబ్దుల్ కరీం మసీదు ‘హల్వాయియన్’ రాత్రిపూట టార్పలిన్‌తో కప్పబడి ఉంటుంది. హోలి సందర్భంగా మసీదుపై రంగులు పడకుండా ఈ చర్య తీసుకున్నారని తెలిసింది.
హల్వాయియన్ ముతవల్లీ హాజీ ముహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ‘అడ్మినిస్ట్రేషన్ సూచనల మేరకు ఎవరూ రంగులు పులమకుండా లేదా మురికి చేయకుండా ఉండేందుకు మసీదును టార్పలిన్‌తో కప్పాము’ అన్నారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హోలి పండుగ సందర్భంగా మసీదును కప్పి ఉంచుకతున్నాం’ అన్నారాయన.
- Advertisement -