Monday, December 23, 2024

త్రిషకు సారీ చెప్పాలా, నెవర్ : మన్సూర్ అలీఖాన్

- Advertisement -
- Advertisement -

తమిళ సినిమాల్లో రేప్ సీన్లలో నటిస్తూ టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్న మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషతో జరిగిన వివాదంలో తగ్గేదేలేదంటున్నారు. త్రిషపై అసభ్యకర కామెంట్లు చేసినందుకు నడిగర్ సంఘం ఆయనపై నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే, నిషేధం తొలగిస్తామని మన్సూర్ కు తెగేసి చెప్పింది.

అయితే సారీ చెప్పేది లేదంటూ తాజాగా వివాదానికి మరింత ఆజ్యం పోశారు మన్సూర్. నిషేధం విధించేముందు తనను వివరణ అడిగి ఉంటే బాగుండేదన్నారు. నిషేధం ఎత్తివేసేందుకు నడిగర్ సంఘానికే తాను కొంత వ్యవధి ఇస్తున్నానని మన్సూర్ చెప్పారు. సినిమాల్లో రేప్ అంటే నిజంగా రేప్ చేస్తారా? హత్య చేసే సీన్ ఉంటే నిజంగా హత్య చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు.

ఇటీవల హీరో విజయ్, త్రిష కలసి నటించిన లియో సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇందులో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా గురించి ఇటీవల ఆయన మాట్లాడుతూ త్రిషతో సినిమా అనగానే, తాను త్రిషను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లే సీన్లు ఉంటాయనుకున్నాననీ, కానీ అలాంటివేమీ లేవంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనిపై త్రిష మండిపడింది. ఇలాంటివాళ్లవల్లే మానవజాతికి కళంకం వస్తోందన్నారు.

త్రిషకు మద్దతుగా ఖుష్బూ, మాళవిక, రోజా తదితరులు నిలిచారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా మెగాస్టార్ కూడా మన్సూర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ త్రిషకు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News