Wednesday, January 22, 2025

డిఫరెంట్ గెటప్స్‌లో అలీ.. దసరాకి సందడే సందడి!

- Advertisement -
- Advertisement -

దసరా వచ్చిందంటే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు క్యూ కడుతుంటాయి. ఎన్ని షోలు వచ్చినా ఈటీవీలో మల్లెమాల ప్లాన్ చేసే షోలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఈ క్రమంలో ఈ దసరాకి కూడా మంచి థీమ్‌తో షోను ప్లాన్ చేశారు. సరిపోదా ఈ దసరాకి అంటూ వదిలిన ఈ ఎపిసోడ్ ప్రోమోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈటివి దసరా స్పెషల్ – 12 అక్టోబర్ 2024 @ 9:30AM Etv తెలుగులో ప్రసారం కానున్నది.

ఇప్పటి వరకు అలీ డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. చిరుతలో నచిమి, దేశముదురు బాబా గెటప్, సూపర్‌లో పెయింటర్, పోకిరిలో బెగ్గర్ పాత్ర అంటూ అందరినీ మెప్పించాడు. ఇవన్నీ కూడా ఆడియెన్స్ ఫేవరేట్ పాత్రలే. అలాంటి కారెక్టర్లు, గెటప్స్ అన్నీ ఒకే సారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

దసరా స్పెషల్ ఈవెంట్‌లో అలీ సందడి చేయబోతోన్నాడు. డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకబోతోన్నాడు. ఇక అలీతో పాటుగా రియాజ్, ఆది, బ్రహ్మాజీ, సంగీత, శ్రీదేవీ ఇలా అందరూ చేసే కామెడీతో ఆడియెన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అన్నది ప్రోమోలను చూస్తే అర్థం అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News