Monday, December 23, 2024

గ్రూపు1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూపు1 పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణపై గురువారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రూఫ్1 పరీక్ష పూర్తి ప్రశాంతంగా సజావుగా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులంత సమన్వయంతో పని చేయాలనీ ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 50808 మంది అభ్యర్థులు పరీక్షా రాయనుండగా109 పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. . ఈ పరీక్షా ఉదయం 10 .30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందన్నారు. హాల్ టికెట్లో పొందపర్చిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాలోకి ఉదయం 8 .30 నుండి 10 .15 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని దీనిని దృష్టిలోపెట్టుకుని అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

అదేవిధంగా డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెస్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, వాచీలు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, వల్లెట్స్, మొదలైనవి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరన్నారు.
ముందు రోజే పరీక్ష కేంద్రాలు శానిటైజ్
పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందుగా శానిటైజ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీటి ఏర్పాటుతో ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎమ్‌ను ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ శాఖను కోరారు.

వెన్యూ సూపర్‌వైజర్లు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ ను అందుబాటులో ఉంచి అభ్యర్థులను శానిటైజ్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను అదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 109 మంది లోకల్ ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్లు ఉంటారని, 30 మంది రూట్ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో పై అధికారులను సంప్రదించాలని సూచించారు.

పోలీస్ సంయుక్త కమిషన్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని, గతంలో లాగా ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను తనికీ చేయడానికి ముగ్గురు మగ పోలీసులు ఇద్దరు లేడి పోలీసులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారి సూర్యలత, డి సి పి బాబు రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News