Wednesday, January 22, 2025

బిసిలందరికీ రూ. లక్ష బిసిబంధు వెంటనే అమలు చేయాలి : ఎంపి.ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

కాచిగూడ: రాష్ట్ర ప్రభుత్వం 14 బిసి కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని బిసి జాబితాలోని 130 కులాలకు వర్తింపజేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా గతం లో సీఎం కెసిఆర్ ప్రకటించిన బిసి బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, గత ఎన్నిక లకు ముందు దరఖాస్తు చేసుకున్న 5లక్షల 77 వేల మందికి వెంటనే సబ్సిడి రుణాలు మం జూ రు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షతన బి.సి యువజన సంఘం విస్తృత స్థా యి సమావేశం, బిసి సంక్షేమ సంఘం స్వర్ణోత్సవ వేడుకలు సోమవారం కాచిగూడలోని అభినందన గ్రాండ్ హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈవేడుకల్లో ఆర్. కృష్ణయ్యతో పాటు మాజీ ఎంపి. వి.హనుమంతరావు పలు బిసి సం ఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘానికి పూర్వ వైభవం తీసుకురావ డానికి విశేష కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. బసిలు అన్ని విధాలుగా అన్యాయానికి గురవుతున్నారని, 9ఏళ్ల కెసిఆర్ పాలనలో బిసిలకు సబ్సిడీ రుణాలు విడుదల కాలేదని ఆయన ఆరోపించా రు. బిసి కార్పొరేషన్‌లోని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తి చేయాలని ఆయన డిమాండ్ చే శారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను ప్రభుత్వాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎంపి. వి.హనుమంతరావు మాట్లాడుతూ.. త్వరలో కేంద్రం చేపట్టే జనగణనలో బిసి కులగణన చేపట్టాలని, మండల్ కమీషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాధికారం సాధించినప్పుడే బిసిల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అవుతాయని, బిసిలలో ఐక్యత లేకపోవడం వల్లనే హక్కులు సాధించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. బిసిల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొ ప్ప వ్యక్తి ఆర్.కృష్ణయ్య అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా బిసి కళాకారుడు రామలింగం పాడిన పాటకు విహెచ్.. నృత్యం చేసి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో పలు బిసి సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, అంజి, అనంతయ్య, సి.రాజేందర్, టిపి సిసి ప్ర ధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్‌యాదవ్, బిసి విభాగం రాష్ట్ర కో- కన్వీనర్ పి.రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొ న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News