Friday, December 20, 2024

బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్ష న్ సెంటర్‌లో జరిగిన నాగర్‌కర్నూల్ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధ న్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ చైతన్య రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సతీమని మర్రి జము న రాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, ప్రజా యుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లు నివాళలుర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎ న్నికల్లో బూత్ కమిటీ సభ్యుల పాత్ర కీలకమని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. నాగర్‌కర్నూ ల్ నియోజకవర్గంలో గత ప దేళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతిపక్ష పా ర్టీల ఎత్తుగడలకుపై ఎత్తు లు వేస్తూ పార్టీ విజ యం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూ చించారు. మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాగర్‌కర్నూల్ ని యోజకవర్గంలో రైతులకు ఎంజెఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పథకం చేపడుతున్నామని తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ మా ట్లాడుతూ వలసల పాలమూరు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతుందని అన్నారు. ఒకప్పుడు డి గ్రీ కళాశాలలేని నాగర్‌కర్నూల్‌లో ఇప్పుడు మెడిక ల్ కళాశాల వచ్చిందని అన్నారు. ఒకప్పుడు ఎండి న కేసరి సముద్రం నేడు నడి బొడ్డులో బుద్ధుని విగ్రహంతో సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇంత అభివృద్ధి చెందిన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం లో బూత్ కమిటీ సభ్యులు అందరూ నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బూత్ కమిటీ సభ్యులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News