Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిన స్థానం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కులవృత్తులకు చేయూతనిస్తూ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో యాదవ సంక్షేమ భవనానికి జడ్పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదవుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచారని, ఇటీవల మండల, నియోజకవర్గ వ్యాప్తంగా గొర్రెలను కాపరులకు అందజేశామని తెలిపారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తూ కుల వృత్తులను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు.

అలాంటి పరిపాలనా దక్షుడికి వచ్చే ఎన్నికల్లో యాదవులంతా మద్దతు పలికి మరోసారి బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేవిదంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి,ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి.జిల్లా గ్రంధాలయ చైర్మన్ రెగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎంపిటిసి పుల్లెంల ముత్తయ్య,దుబ్బాక పావనీ శ్రీధర్,పలువురు యాదవ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News