కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని సిఎం కెసిఆర్ ప్రతి ఒక కులానికి ప్రభుత్వ భూమితో పాటు భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 14వ డివిజన్ సప్తగిరి కాలనీలో గౌడ రజక మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణాలకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారని.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు హాయంలో ఇచ్చిహామీలు మర్చిపోయి ప్రజా సమస్యలు పట్టించుకోలేదని… తెలంగాణ ప్రభుత్వంఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హాయంలో మున్సిపల్ లో నిధులు లేక కరీంనగర్ అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడ చూసిన మట్టి రోడ్లు.. రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలు దర్శనం ఇచ్చేవి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరీంనగర్ అభివృద్ధి కోసం సిఎం 100 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని.. తను చేసిన అభివృద్ధిని చూసి నగర్ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని గుర్తు చేశారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని.. నియోజకవర్గ ప్రజలు శభాష్ అనే విధంగా కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.
కరీంనగర్ ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దానిలో భాగంగా మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్తులను కేసీఆర్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. మానే రివర్ ఫ్రంట్ పనులను ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బిఆర్ ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు దిండిగాల మహేష్,బోనాల శ్రీకాంత్ తోట రాములు గుగ్గిల్ల జయశ్రీ, గందె మాధవి – మహేష్ ఐలేందర్ యాదవ్ బండారు వేణు, భూమా గౌడ్ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు