Sunday, January 19, 2025

ప్రాంతీయ భాషలకు పట్టం

- Advertisement -
- Advertisement -

మన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలన్న ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష నెరవేరింది. జాతీ య స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని గతంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఆ మేరకు ప్రధానికి, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐ టి శాఖ మంత్రికి లేఖలు రాశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగంలో దేశవ్యాప్తంగా ని యామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)లను 13 ప్రాంతీయ భాషల్లో వీ టిని నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించ డం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మల్టీ-టా స్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ – 2022 ను ప్రాంతీయ భాషలతోపాటు మొత్తం 15 భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

హిందీ, ఇంగ్లీష్ తోపాటు తెలుగు, ఉర్దూ, త మిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, బెం గాలీ, గుజరాతీ, కొంకణి, మణిపూరి(మైతి), మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లో పోటీ ప రీక్షలను నిర్వహిస్తున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఎమ్‌ఎఎస్ పరీక్షను ఇలా ప్రాంతీయ భాషల్లో చేపట్టడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక నుంచి మొత్తం 15 భాషల్లోనూ వీటిని నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థల్లో అతిపెద్దదిగా ఉన్న స్టాఫ్ సెలక్షన్ క మిషన్ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్-బీ (నాన్- గెజిటెడ్), గ్రూప్-సీ (నాన్-టెక్నికల్) విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది.
2020లోనే ప్రధానికి సిఎం లేఖ
జాతీయ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సిఎం కెసిఆర్ 2020 నవంబర్ 1న ప్రధాని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు కెసిఆర్ లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే, రక్షణ రంగం, జాతీయ బ్యాంకుల్లోని ఉద్యోగాల భర్తీకి హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీంతో ఇంగ్లీష్ మీడియం చదువుకోని వారు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోతున్నారని వివరించారు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించాలని కోరారు. యుపిఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, ఐబిపిఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తదితర నియామక సంస్థల పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరారు.
2021లో కేంద్రమంత్రికి కెటిఆర్ లేఖ
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌కు లేఖ రాశారు.కేంద్ర సర్వీసులు, ఇతర శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షలను కేవలం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తున్న కారణంగా ప్రాంతీయ భాషల్లో చదివిన ఉద్యోగార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఉద్యోగాలు పొందలేకపోయిన తెలుగు అభ్యర్థులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేపడతున్న నియామకాల్లో తెలుగు అభ్యర్థులకు మొదటి నుంచీ అన్యాయమే జరిగింది. ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ కేంద్ర ఉద్యోగాలను ఆశించిన సంఖ్యలో పొందలేకపోయారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులతో పోటీ పడి ఉద్యోగాలు సాధించలేకపోయారు. కేంద్ర నియామక సంస్థలు హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తుంచడంతో హిందీ రాని తెలుగు అభ్యర్థులు, ఆంగ్ల మాధ్యమంలో చదువుకోని అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు 10 శాతానికి మించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలను అనుమతించాలన్న సిఎం కెసిఆర్ ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాల సహా దక్షిణాది రాష్ట్రాల ఉద్యోగార్ధులకు ప్రయోజనం కలుగనుంది. ప్రతిభ, నైపుణ్యాలు ఉండి భాష కారణంగా ఉద్యోగాలు పొందలేకపోయిన అభ్యర్థులకు లబ్ది చేకూరనుంది.
ఎస్‌ఎస్‌సి పరీక్షా విధానంలో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వ రంగంలో దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షా విధానంలో కేం ద్రం కీలక మార్పులు తెచ్చింది. ఇప్పటివరకు కేవలం హి ందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తుండగా.. తా జాగా 13 ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో భాష అవరోధంతో ఏ ఒక్కరూ అవకాశం కోల్పోవద్దనేదే తమ ఉద్దేశమని తెలిపింది. ఇదే విషయంపై వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోకాలంగా అభ్యర్ధనలు వస్తున్నాయని.. ముఖ్యంగా దక్షిణాది రా ష్ట్రాల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News