Saturday, November 23, 2024

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రాష్ట్రంలో అర్హులుందరికీ రెండుగదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేట భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండా గుండా మండలంలో కొనసాగుతుంది. విక్రమార్కకు గ్రామం మొత్తం ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. సోమవారం మున్యనాయక్ తండాలో భట్టి మాట్లాడుతూ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని, కాంగ్రెస్ ప్రభుత్వమేనని అప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు, వంద రోజులు పనికి వెళ్లే వారికి, నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇ చ్చారు.

అంతేకాకుండా ఇంట్లో ఉండే ఇద్దరు ముసలవ్వలకు, తాతకు వృద్దాప్యాపింఛన్ ఇస్తామని, ప్రభుత్వం వచ్చిన తొలిఏడాదే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. నిరుద్యోగులకు నెల కు రూ.4వేలు నిరుద్యోగల భృతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చదువుకున్న బిడ్డలకు కొలువులు లేవు, ఇండ్లు లేవు, గ్యాస్ ధర కొనేట్లు లేవంటూ గ్రామస్తులు భట్టికి తెలిపారు. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన కాకతీయ కాలువ ఎక్స్ టెన్షన ఫేజ్ 2 కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయని తెలిపారు.

ఆదివాసీలు, అడవి బిడ్డల కోసం పోడు భముల చట్టాన్ని తీసుకువచ్చింది యూపిఏ ప్రభుత్వం అని ఆ యన అన్నారు. అడవి వారిది, అడవి మీద హక్కులు కూడా వారివేనని యూపిఏ ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చిందనీ, ఈ చట్టాలను అమలు చేయకుండా అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలో కలిసిపోయే ఆదీవాసుల హక్కులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలోని ఆడవి బిడ్డలను అడవి నుంచి బయటకు వెళ్లగొట్టేలా కెసిఆర్ ప్రభుత్వం క్రూరమైన కుట్రపూరితమైన బీఆర్‌ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిచారు. మరో నాలుగు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు పెద్ద ఎత్తున ఆదివాసీలకు భూమిపైనా, అడవి పైన హక్కులను వారికే ధారదత్తం చేసే నిర్ణయాలు తీసుకుంటామని అంతేగాక అటవీ హక్కుల చట్టాన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పో డు భూముల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, వేనారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్, చింతమల్ల రమేష్, భగవాన్, బాణోత్ సుజాత, బానోత్ దుర్గాబాయి, దేవిక, బానోత్ ప్రమీల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News