Saturday, November 23, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలతో కలలన్నీ సాకారం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియమకాల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించుకున్న అనాది కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో నిలుపుకోగలిగాం అని ఎమ్మెల్సీ, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ అన్నారు. బుధవారం నగర శివారులోని ప్రకాశ్ నగర్ చప్టా వద్ద జరిగిన సాగునీటి సంబరానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల నీళ్ళ గోస తెలిసిన నేత కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలి లక్ష్యంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల అందించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను ఇతర పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చెరువులను ఆధునీకరణ చేసుకున్న విజన్ తోనే చేపట్టిన మీషన్ కాకతీయ వల్ల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు ఎవరు ఊహించని స్థాయిలో పెరిగాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంకితాభావంతో పనిచేసే అద్భుతమైన ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం సాధించేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

నీటిపారుదల ఆయకట్ట ఖమ్మం నియోజవర్గ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాగునీటి అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మిషన్ కాకతీయ పథకం, చెక్ డ్యామ్స్ పథకం, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారని మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులలో పూడిక తీయడం, కట్టలు, కట్టడాలు బలపరుచుట వంటి అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో చేశారన్నారు. అసెంబ్లీ నియోజకవర్గమునకు ఒక్కొక్కటి చొప్పున చేపట్టిన మినీ ట్యాంక్ బండ్లు తీర్చిదిద్దారన్నారు.

ఖమ్మం నగరలోని మురికికుప్పతో పేరుకుపోయిన లకారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితో లకారం ట్యాంక్ బండ్ సుందరీకరణగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ ఆదర్శ్ సురబీ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు ధనాల రాధా, గజ్జల లక్ష్మి, దోన్వాన్ సరస్వతి, రుద్రగాని శ్రీదేవి, నీటి పరిధుల శాఖ సి.ఈ శంకర్ నాయక్, డిప్యూటి సిఇ ధన కుమార్ రెడ్డి, ఎస్‌ఈ నరసింగరావు, ఇఇ అనన్య, బిఆర్‌ఎస్ నాయకులు ముందడపు సుధాకర్, రుద్రగాని ఉపేందర్, కన్నం ప్రసన్న కృష్ణ, గజ్జల వెంకన్న, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News