Monday, December 23, 2024

ఎల్లుండి నుంచి స్కూళ్లు

- Advertisement -
- Advertisement -

All educational institutions will be reopened from February 1

విద్యాసంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం
కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి : మంత్రి సబిత

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యా సంస్థలు ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించగా, కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించనున్నట్లు ప్రభు త్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభించేందుకు అనుమతిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News