మహబూబ్ నగర్: ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాస్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లా పాత్రికేయులతో మాటామంతీ నెరిపారు. ఈ సందర్భంగా తన వరకైతే జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చేలా చూస్తానన్నారు. దీనికి ముందు టియుడబ్ల్యుజె(ఐజెయు) పాత్రికేయ యూనియన్ సభ్యులు జిల్లా అధ్యక్షుడు దండు దత్తాత్రేయ నేతృత్వంలో ఎంఎల్ఏను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఇదివరకటి ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ లను కూడా పొందలేని జర్నలిస్టులకు వాటిని ఇప్పించాలని కోరారు. తమకు అన్యాయం జరిగిందని ఎంఎల్ఏ కు తెలుపుకున్నారు.
ఎంఎల్ఏ యెన్నం వారు చెప్పినవని విని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకటి ప్రభుత్వంలా తప్పులు చేయదన్నారు. తాము కొన్ని మార్గదర్శకాలు ఏర్పరిచామని, దాని ప్రకారం జర్నలిస్టులందరికీ ఇండ్లు వస్తాయని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ హౌజింగ్ స్కీమ్ కింద పాత్రికేయాలందరికీ ఇండ్లు లభించేలా చూస్తామన్నారు. ఏ యూనియన్ కు చెందినప్పటికీ జర్నలిస్టులందరూ మంచి కోసం పనిచేయాలన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ను అమలుచేస్తోందన్నారు. ఏకపక్ష నిర్ణయాలకు బదులు సంబంధిత వర్గాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.