Saturday, November 16, 2024

ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలి

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణ సమగ్రశిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం
  • వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రవిందర్

రాయికల్: తెలంగాణ సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరిని క్రమబద్దీకరించాలని, పే స్కేలు అమలు చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కుడుకల రవింధర్ తెలిపారు. జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాలల్లో ఆదివారం జరిగిన జిల్లా ఉద్యోగుల సమావేశంలో చర్చించిన ఆంశాలను మీడియాకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత లేకుండా పని చేయిస్తుందన్నారు.

పనికి తగ్గ వేతనాలు అమలు చేయడంలేదని వాపోయారు. తమ సంఘం భవిష్యత్తులో చేసే ఉద్యమాలకు అన్ని విభాగాల ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ప్రతి ఉద్యోగిని క్రమబద్దీకరించి, పే స్కేలు అమలు చేయాలని, మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగుల సమస్యలన్నింటికి పరిష్కారం దొరికే వరకు ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా అధ్యక్షులు బర్ల నారాయణ,గౌరవ అధ్యక్షులు అనుమల్ల శ్రీనివాస్,కోశాధికారి చిట్యాల రవి,ఎండి ఫరూక్, ఉపాధ్యక్షులు నీరటి ఆంజయ్య, రాజేంధర్, రమేష్, వెంకటేశ్వర్‌రావు, రాజబాబు, సురేష్, శ్యాంసుందర్, అభినయ్, ఎపిఓ ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News