Wednesday, January 22, 2025

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. సెమీస్‌లో గాయత్రి జోడీ

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: భారత యువ డబుల్స్ క్రీడాకారిణిలు గాయత్రి గోపీచంద్‌ట్రీసా జాలీ జోడీ చరిత్ర సృష్టించారు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన గాయత్రి జోడీ మహిళల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత జంట 2114, 1821, 2112 తేడాతో చైనాకు చెందిన లీలియు జోడీపై విజయం సాధించింది. తొలి సెట్‌లో భారత జంట పైచేయి సాధించింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జోడీపై అలవోక విజయాన్ని అందుకుంది.

కానీ రెండో గేమ్‌లో మాత్రం గాయత్రి జంట ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన చైనా జోడీ సెట్‌ను దక్కించుకుంది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో గేమ్‌లో మాత్రం మళ్లీ గాయత్రి జోడీ ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణ కొరియాకు చెందిన లీబేక్ జంటతో భారత జోడీ తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News