వనపర్తి : ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులు, అధ్యాపకులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్య ను అభ్యసించడానికి వీలుగా మన ఊరు మన బడి, మనబస్తీ మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించగా వ్యవసాయ శాఖ మ ంత్రి వనపర్తి జిల్లాలో పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి వనపర్తి జిల్లాలో మన ఊరు మన బడి కింద మొదటి విడతలో మంజూరై అన్ని పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను ప్రార ంభోత్సవం చేశారు. పాఠశాలల పునరుద్ధరణ కా ర్యక్రమంలో భాగంగా ఉదయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బండార్ నగర్‌ను ప్రారంభోత్సవం చేశారు. రూ. 14.32 లక్షల వ్యయంతో ఇ ంగ్లీష్ మీడియం, రూ. 4.92 లక్షల వ్యయంతో ఉర్దూ మీడియం పాఠశాలలకు మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, విద్యుత్, గ్రీన్ బోర్డు, డ్యుయల్ డెస్క్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు మన ఊరు మన బడి కార్యక్రమం కింద కల్పించడం జరిగిందని, పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా మ ంత్రి ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠా లు బోధించారు.
విద్యార్థుల పఠన సామర్థాన్ని పరిశీలించారు. మంత్రి ఉర్దూలో సైతం గ్రీన్ బోర్డుపై రాసి ఉర్దూ మీడియం విద్యార్థుల సామర్థాలను ప రిశీలించారు. పిల్లలు ప్రతి రోజు స్నానం చేసుకోవాలని, రోజు తప్పించి రోజు తలస్నానం చేసుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిన ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక నూతన ఒరవడి ప్రారంభమైందన్నారు. విద్యపై పెడుతున్న పెట్టుబడి భావితరానికి నిజమైన పెట్టుబడి అని అభివర్ణించారు.
అనంతరం రూ. 10.43 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేడిఆర్ నగర్ పాఠశాలను ప్రారంభోత్సవం చేశా రు. అచ్యుతాపురంలో రూ. 12.04 లక్షల నిధులతో మన ఊరు మన బడి కింద పునరుద్ధరణ చే సిన పాఠశాలను ప్రారంభోత్సవం చేశారు. గోపాల్‌పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే 27 మంది విద్యార్థినులకు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తమకు మంచినీటి సమస్య ఉందని, అదే విధంగా ప్రహారీ గోడ కావాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి వెంటనే తాగునీటి సమస్య తీర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రహారీ గోడ సైతం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండల పరిషత్ ప్రాథమికొన్నత పా ఠశాల కేశంపేట, రేవల్లి మండలంలో రూ. 8.89 లక్షలతో పునరుద్ధరణ చేసిన పాఠశాలను ప్రారంభోత్సవం చేశారు. రేవల్లి గ్రామ పంచాయతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను రూ. 29.57 లక్షలతో మన ఊరు మన బడి కింద మౌలి క సదుపాయాలు కల్పించగా మంత్రి ప్రారంభోత్సవం చేశారు. నాగపూర్ గ్రామం మండల పరిషత్ పాఠశాలను రూ. 25.97లక్షలతో ఆధునీకరించగా ప్రారంభోత్సవం చేశారు. పక్కనే రూ. 12 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సముదాయాన్ని సైతం మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కా ర్యక్రమంలో జెడ్పి చైర్మన్ ఆర్. లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, మున్సిపల్ చై ర్మన్ గట్టు యాదవ్, డిఈఓ గోవిందరాజులు, పిఎసిఎస్ చైర్మెన్ రఘు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, మం డల విద్యాధికారి, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.