Tuesday, November 5, 2024

రిజర్వేషన్ల ఫలాలు అన్ని కుటుంబాలకు అందలేదు: మంద కృష్ణ మాదిగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణకు మద్దతుగా నిలబడిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఎంఆర్‌పిఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగా తెలిపారు. శనివారం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్‌సి వర్గీకరణ తీర్పును దక్షిణాదిలో నలుగురు సిఎంలు వెంటనే స్వాగతించడం మంచి పరిణామం అని కొనియాడారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదన్నారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని, ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ సాకారం కావడంలో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయడంలో రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల్లో వెంటనే అమలు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయాలని పిఎం మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. వర్గీకరణపై తీర్మానం ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి న్యాయమూర్తికి పేరుపేరునా ధన్యవాదుల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News