Tuesday, April 1, 2025

మహబూబాబాద్ లో కుండపోత వాన.. ఇండ్లు మొత్తం మునిగిపోయాయి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షానికి ఇండ్లు మొత్తం నీట మునిగిపోయాయి. నర్సింహులపేట మండలంలో బొడ్డి తండా వరదలో నీటిలో మునిగిపోయింది. భారీగా ఇండ్లలోకి వరద నీరు చేరడంతో, ఇండ్ల మిద్దెల మీదకు ఎక్కి తండా వాసులు తమకు కాపాడాలంటూ కోరుతున్నారు.

మరోవైపు, జిల్లాలోని నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. తమ కాపాడమని ప్రయాణికులు వేడుకుంటున్నారు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News