Wednesday, January 22, 2025

కశ్మీరు విద్యార్థికి నీట్‌లో ఆల్ ఇండియా 10వ ర్యాంక్

- Advertisement -
- Advertisement -

All India 10th rank in NEET for Kashmiri student

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో ఒక పండ్ల వ్యాపారి కుమారుడు నీట్(యుజి)లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించాడు. దక్షిణ కశ్మీరుకు చెందిన షోపియాన్ పట్టణంలోని ట్రెంజ్ ప్రాంతానికి చెందిన పండ్ల వ్యాపారి పర్వేజ్ అహ్మద్ కుమారుడైన హజీఖ్ పర్వేజ్ లోనెకు 720 పాయింట్లకు గాను 710 పాయింట్లు లభించాయి. నీట్ యుజిలో ఆల్ ఇండియా స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన లెనెకు జమ్మూ కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేశారు. నీట్‌లో జమ్మూ కశ్మీరులో అగ్రస్థానంలో నిలిచిన లోనెను బంధుమిత్రులతో పాటు షోపియాన్ నగరానికి చెందిన ప్రజలు కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు. మంచి ర్యాంకు సాధిస్తానని భావించినప్పటికీ ఆల్ ఇండియాలో 10వ ర్యాంకు సాధిస్తానని ఊహించలేదని లెనె తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News