- Advertisement -
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 30,31న నిర్వహించాలనుకున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. తమ సమ్మె నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బియూ శనివారం వెల్లడించింది. ఐదు రోజుల పని దినాలు, ఎన్‌పిఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో భర్దీ తదితర డిమాండ్ల సాధనకు బ్యాంకు యూనియన్లు ఈ సమ్మెను తలపెట్టాయి. అయితే ఈ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు జనవరి 31న సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం తెలిపారు. కాగా బ్యాంకులు జనవరి 30,31 యథావిధిగా పనిచేయనున్నాయి.
- Advertisement -