Thursday, January 9, 2025

ఆల్-ఇండియా K-POP కాంటెస్ట్ 2024 గ్రాండ్ ఫినాలే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (“LG ఎలక్ట్రానిక్స్ ఇండియా”), కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (KCC) సహకారంతో, ఆల్-ఇండియా K-POP కాంటెస్ట్ 2024 మూడవ సంచికను ధగధగాయమానమైన గ్రాండ్ ఫినాలేతో ముగించింది. ఈ సంచికలో భారతదేశం, కొరియా దేశాల మధ్య పరిఢవిల్లుతున్న సాంస్కృతిక సంబంధాలు, అసామాన్యమైన టాలెంట్లను వేడుకగా జరుపుకోవటం జరిగింది.

అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులను గడించిన K-POP బ్యాండ్ LUN8 వారు ప్రదర్శించిన కార్యక్రమం ఆ సాయంత్రం జరిగిన కార్యక్రమానికే తలమానికం. డైనమిక్ కొరియోగ్రాఫీ, తరగని శక్తిని కలిగి ఉంటుందని పేరుప్రఖ్యాతులు కలిగిన LUN8 అగ్రశ్రేణి హిట్¬లను అందించింది. వీక్షించిన ప్రేక్షకులందరూ ఆనందడోలికల్లో నృత్యం చేస్తూండిపోయారు. దీనితో ఈ కార్యక్రమం మైమరపింపజేసే K-POP అనుభవంగా అభిమానుల మనసుల్లో ముద్రవేసుకుంది.

ఉత్కంఠభరితమైన ఫినాలేలో, సింగింగ్ (గాత్రం) విభాగంలో కోల్¬కతాకు చెందిన అభిప్రియా చక్రబర్తి విజేతగా నిలవగా, డాన్సింగ్ (నృత్యం) విభాగంలో ఇటానగర్¬కు చెందిన ద ట్రెండ్ టైటిల్¬ను కైవసం చేసుకున్నారు. ట్యాలెంట్ కలిగిన ఈ స్టార్స్ అత్యుత్తమ బహుమానం – మొత్తం-అన్ని-ఖర్చులను-చెల్లించే కొరియా ట్రిప్ గెలుచుకున్నారు. అక్కడ వారు, K-POP పరిశ్రమ హృదయాంతరాళాలను శోధించి, దాని ఘనమైన సంస్కృతిలో మునిగితేలుతారు.

విజేతలను అభినందిస్తూ శ్రీ హోంగ్ జూ జియోన్, మేనేజింగ్ డైరెక్టర్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ఇలా అన్నారు, “ఆల్-ఇండియా K-POP కాంటెస్ట్ 2024 గ్రాండ్ ఫినాలేలో అసాధారణమైన టాలెంట్, ఉద్వేగం, అంకితభావం కనపించింది. పాల్గొన్న ప్రతి అభ్యర్ధి, వేదిక మీద విభిన్నతను ప్రదర్శించారు. వారు ప్రదర్శించిన అంశాలు K-POP స్ఫూర్తికి నిజంగా అద్దం పట్టాయి. విజేతలైన ద ట్రెండ్ మరియు అభిప్రియా చక్రబర్తి లకు, వారు సాధించిన విజయానికిగాను నా హృదయపూర్వక అభినందలను తెలియచేస్తున్నాను. వారి కృషి, సృజనాత్మకత, నిజంగా అభినందనీయమైనవి. LGలో యువ టాలెంటును ప్రోత్సహిస్తూ, భారతదేశం మరియు కొరియా దేశాలకు మధ్య సాంస్కృతిక సంబంధాల వేడుకలను నిర్వహించటం గర్వకారణం. మన యువతరంలో నిండి ఉన్న అపరిమితమైన శక్తిసామర్ధ్యాలకు, సమైక్యతను కలిగించటంలో సంగీతానికి మరియు నృత్యాలకు ఉన్న శక్తిసామర్ధ్యాలకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది.”

ఇండియాలో కొరియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ హువాంగ్ ఇల్ యోంగ్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు “భారతీయ అభిమానుల నుండి ఉత్సాహంతో కూడిన సహాయం లభించినందుకు ధన్యవాదాలు, K-popకు అద్భుతమైన ఆప్యాయాభిమానాలు లభించటంతో, మేము గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నాము. మా భారతీయ అభిమానుల కోసం మరింత అద్భుతమైన వేదికను అందిస్తూ మళ్ళీ వచ్చే ఏడాది తిరిగి రావాలని మేము ఆశిస్తున్నాము.”

విశిష్ఠమైన న్యాయనిర్ణేతలతో కూడిన ప్యానెల్ విజేతలను ఎంపిక చేసింది. ఈ న్యాయనిర్ణేతలలో, శ్రీ కిమ్ ఉక్, కంటెంట్ క్రియేటివ్ కంపెనీ అయిన డబ్యూ కొరియా సిఇఒ, వన్ మిలియన్ డాన్స్ స్టూడియోకు చెందిన కొరియోగ్రాఫర్ శ్రీ పార్క్ బాంగ్-యంగ్, KPOP డాన్స్ యూట్యూబర్ శ్రీ గూ తాయ్ క్యూంగ్, ఫాంటాగియో ఎంటర్¬టెయిన్మెంట్ టీమ్ హెడ్ అయిన శ్రీ కిమ్ జిన్ సూ ఉన్నారు. పోటీల్లో పాల్గొన్న అభ్యర్ధుల కళాత్మక నైపుణ్యాన్ని, వారి అంకితభావాన్నివారు అభినందించారు.

ఆల్-ఇండియా K-POP కాంటెస్ట్ వంటి కార్యక్రమాల ద్వారా, LG ఎలక్ర్టానిక్స్ ఇండియా, జెన్ Zని ప్రతిబింబించే ఒక బ్రాండ్¬గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. K-POP వంటి అంతర్జాతీయ సాంస్కృతిక శైలులను అర్ధవంతమైన వేదికలతో, తమను తాము వ్యక్తపరుచుకునేందుకు మేళవించటం ద్వారా LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఒక కనెక్షన్, ఒక అనుబంధం ఉన్న భావాన్ని యువతలో నిరంతరం కలుగజేస్తూంటుంది.

ఈ ఏడాది జరిగిన కాంటెస్ట్ భారతదేశంలో K-POPకు పెరుగుతున్న ప్రజాదరణను మరింతగా పెంపొందించి, సంస్కృతుల మధ్య వారధిగా నిలవగలగటంలో సంగీతానికి, నృత్యానికి ఉన్న శక్తిని ప్రదర్శించింది. గుర్తింపు కోరుకుంటున్న టాలెంట్¬కు వేదికను అందించటం ద్వారా, LG ఎలక్ట్రానిక్స్ మరియు KCC యువతను ప్రోత్సహించటాన్ని కొనసాగించాయి, ఇరుదేశాలు తమ సంస్కృతులను పరస్పరం తెలియచెప్పుకోవటాన్ని ప్రోత్సహించటాన్ని కొనసాగించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News