Thursday, January 23, 2025

నేడే తిరుపతిలో అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ

- Advertisement -
- Advertisement -
మహాసభకు తరలివెల్లిన వేలాది మంది బిసి నేతలు
తిరుపతికి వెళుతున్న బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జాజుల

హైదరాబాద్ : మండల్ కమిషన్ సిఫారసులను అమలు, బిసి కుల గణన, చట్ట సభలలో బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 7న ఓబిసి మహాసభను నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాలు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తిరుపతి పట్టణంలోని ఎస్వీ యూనివర్సిటీ మహతి ఆడిటోరియంలో జరిగే ఈ అఖిల భారత ఎనిమిదివ ఓబిసి మహాసభలో వేలాది మంది బిసి ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం జరిగే జాతీయ మహాసభకు ఆదివారం హైదరాబాదులోని బిసి భవన్ నుండి వేలాది మంది బిసి నేతలు వివిధ బస్సుల్లో తరలి వెళ్ళారు. ఈ బస్సులను జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ ఒబిసి మహాసంగ్, అఖిల భారత బిసి ఫెడరేషన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జాతీయ ఓబిసి మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈసారి ఎనిమిదవ జాతీయ ఓబిసి మహాసభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు జాజుల తెలిపారు. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలూ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సామాజిక ఉద్యమ సంఘాల నేతలు హజరవుతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల నుండి వేలాదిమంది బిసి ప్రతినిధులు తిరుపతి మహాసభకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు . ఈ మహాసభలో దేశవ్యాప్తంగా బిసి ఉద్యమ నిర్మాణం, ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించి భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ మహాసభకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతితంగా బిసి శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని జాజుల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి నేతలు కుల్కచర్ల శ్రీనివాస్,ఎస్ దుర్గయ్య, సింగం నగేశ్ , మణిమంజరి, ఈడిగ శ్రీనివాస్, వరికుప్పల మదు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News