Monday, November 25, 2024

29 నుంచి ఒడిశాలో అఖిల భారత భద్రతా సమావేశం

- Advertisement -
- Advertisement -

ఈనెల 29న భువనేశ్వర్‌లో ప్రారంభమయ్యే అఖిల భారత డిజిపిలు, ఐజిల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులపాటు ఒడిశాలో బస చేయనున్నారు. నవంబర్ 29వ తేదీ రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్న ప్రధాని డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోనే ఉంటారని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ సోమవారం విలేకరులకు తెలిపారు. ఒడిశా రాజధానిలో మొట్టమొదటిసారి జరుగుతున్న డిజిపిలు, ఐజిల అఖిల భారత సమావేశానికి ప్రధాని హాజరవుతారని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపిలు, భద్రతా దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

మోడీతోపాటు కేంద్ర హోం మత్రి అమిత్ షా, ఎన్‌ఎస్‌జి సలహాదారు అజిత్ దోవల్, నిఘా విభాగానికి చెందిన సీనియర్ అధికారులతోపాటు అన్ని రాష్ట్రాల డిజిపిలు, సిఆర్‌పిఎఫ్ డిజి, రా, ఎన్‌ఎస్‌జి, ఎస్‌పిజి అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో అంతర్గత భద్రత, సైబర్ నేరాలు, మావోయిస్టు సమస్య, కృత్రిమ మేధ(ఎఐ) ద్వారా ఎదురయ్యే సవాళ్లు, డ్రోన్లతో కొత్తగి ఎదురవుతున్న ముప్పు, ఉగ్రవాద నిరోధక చర్యలు తదితర ముఖ్యమైన అంశాలను చర్చించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News