Sunday, September 8, 2024

అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెలలో జిల్లాల వారిగా అఖిల భారత యాదవ మహాసభ ఆవిర్భవించి వంద సంవత్సరాలు ఒక పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మహాసభ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఆఖిల భారత యాదవసంఘం రాష్ట్ర నాయకులు ఆర్. లక్ష్మణ్‌యాదవ్, రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర పాట్నా హైకోర్టు జనగణనలో కుల గణనను చేపట్టవచ్చని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ దేశంలో, రాష్ట్రాలలో కుల జనగణనను చేపట్టాలని అన్ని రాష్ట్రాల్లో ఉన్న యాదవ సంఘాలు కోర్టులలో పిటిషన్ వేయాలని సూచించారు. అదే విధంగా మండల్ డే ను జరపాలని కోరారు. ఈకార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ , వెంకట నరసయ్య యాదవ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ , రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు బర్ల జగదీష్ యాదవ్ , యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ రాష్ట్ర ఉప కార్యదర్శి శశి యాదవ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News