Saturday, February 22, 2025

భాష ఆధారంగా విభజన వద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :  మధ్య ఎన్న డూ ఎటువంటి శత్రుత్వమూ లేదని, అవి ప స్పరం సుసంపన్నం చేసుకున్నాయని, త ద్వారా భాష ప్రాతిపదికపై వివక్ష ప్రదర్శన యత్నాలకు అవి గట్టి గుణపాఠం నేర్పాయ ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో 98వ అఖిల భారతీ య మరాఠీ సాహిత్య సమ్మేళన్ ప్రారంభ కా ర్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోడీ మరాఠీని సంపూర్ణ భాషగా శ్లాఘించారు. ధై ర్య సాహసాలు. రమ్యత, సున్నితత్వం, స మానత్వ లక్షణాలు కలగలిసిన భాష అది అని ఆయన పేర్కొన్నారు. ‘భారతీయ భాష ల మధ్య ఎన్నడూ ఎటువంటి విరోధమూ లే దు. భాషలు ఎల్లప్పుడూ ప్రభావం చూపా యి, పరస్పరం సుసంపన్నం చేసుకున్నా యి’ అని మోడీ చెప్పారు. భాషల ఆధారం గా విభజనల సృష్టికి ప్రయత్నాలు జరిగినప్పుడు భారత్‌లో భాషాపరమైన వారసత్వ సంపద గట్టి సమాధానం ఇచ్చిందని ఆయ న తెలిపారు. ‘ఈ దురవగాహనలకు దూరం గా ఉండి, అన్ని భాషలను స్వాగతించి, సు సంపన్నం చేసుకోవడం మన సామాజిక బా ధ్యత’ అని ప్రధాని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం

(ఎన్‌ఇపి) అమలు దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని విధించే యత్నం అన్న తన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పునరుద్ఘాటించిన రోజు ప్రధాని మోడీ ఆ ప్రకటన చేయడం గమనార్హం. భారత్ ప్రపంచంలో అత్యంత ప్రాచీన సజీవ నాగరికతల్లో ఒకటి అని, దేశం నిరంతరం పరివర్తన చెందుతూ, కొత్త అభిప్రాయాలను, మార్పులను స్వాగతించడం ఇందుకు కారణమని మోడీ పేర్కొన్నారు. ‘ప్రపంచంలో అతి పెద్ద భాషాపరమైన విభిన్నతను భారత్ కలిగి ఉండడం ఇందుకు నిదర్శననం. భాషాపరమైన ఈ విభిన్నత మన సమైక్యతకు అత్యంత మౌలిక ప్రాతిపదిక’ అని మోడీ చెప్పారు. ఎన్‌సిపిఎస్‌పి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, 98వ అఖిల భారతీయ మరాఠీ సమ్మేళన్ అధినేత సాహితీవేత్త తారా భావల్కర్ ప్రభృతులు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌ను న్యూఢిల్లీలో 71 ఏళ్ల తరువాత, మరాఠీకి ప్రాచీన సాంస్కృతిక భాష హోదా మంజూరు చేసిన ఒక ఏడాది తరువాత నిర్వహిస్తున్నారు. ఛత్రపతి శివాజీ 350వ పట్టాభిషేక మహోత్సవం, ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News