Monday, December 23, 2024

మార్కెట్లోకి ఆల్-న్యూ బిఎండబ్ల్యూ 7 సిరీస్, ఎలక్ట్రిక్ ఐ7

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏడో తరం ఆల్-న్యూ బిఎండబ్ల్యూ 7 సిరీస్, తొలి పూర్తి ఎలక్ట్రిక్ బిఎండబ్లు ఐ7 మోడళ్లను జర్మనీ కంపెనీ బిఎండబ్ల్యూ లాంచ్ చేసింది. దీనితో బిఎండబ్ల్యూ ఫ్లాగ్‌షిప్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లలో తన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చిన కంపెనీగా నిలిచింది.

ఇప్పుడు బిఎండబ్ల్యూ 740ఐ ఎం స్పోర్ట్ స్థానికంగా బిఎండబ్ల్యూ గ్రూప్ ప్లాంట్ చెన్నైలో తయారవుతుండగా, ఆల్-ఎలక్ట్రిక్ బిఎండబ్ల్యూ ఐ7 ఎక్స్‌డ్రైవ్60 పూర్తిగా బిల్ట్-అప్ యూనిట్ (సిబియు)గా అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్‌ను తర్వాత పరిచయం చేయనున్నారు. డెలివరీలు మార్చి 2023 నుంచి ప్రారంభమవుతాయి. ఎక్స్-షోరూమ్ ధరలో కార్లు అందుబాటులో ఉన్నాయి .ఆల్-న్యూ బిఎండబ్ల్యూ 740ఐ ఎం స్పోర్ట్ రూ. 1.75 కోట్లు, ఫస్ట్-ఎవర్ ఫుల్లీ ఎలక్ట్రిక్ బిఎండబ్ల్యూ ఐ7 ఎక్స్ డ్రైవ్60 రూ.1.95 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News