Friday, November 15, 2024

అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థా యిలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అదేశించారు. ముంపుకు గురైన హిమాయత్ నగర్‌లోని ఆదర్శ్ బస్తీతో పాటు నల్లకుంట పద్మ నగర్, నాగయ్య కుంట అడిక్‌మెట్ ప్రాంతాల్లో వర్షంతో ఇబ్బందికి గురైన ప్రాంతాలతో పాటు నాలా పనులను ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠా గోపాల్ తో ఆయన కలిసి పరిశీలించారు.

ము హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం.14 లోతట్టు ప్రాంతంలో గురువారం రాత్రి నాలా పొంగి ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో మా న్సూన్ అత్యవసర సహాయక బృందాలతో పాటు డి ఆర్‌ఎఫ్ టీంలు మోటర్లు సహాయం నీటి తొడివేశారు. ఈ నేపథ్యంలో ఆయా ముంపు ప్రాంతాలను కమిషనర్ రోనాల్ రోస్ తో పాటుగా ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, లేక్ సి ఇ సురేష్ కుమార్, యస్‌ఈ ఆనంద్ తో కలిసి పరిశీలించారు.నాలా పొంగటానికి గల కారణాలను కమిషనర్ లేక్ ఇంజనీరింగ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ సాగర్ నాలా లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యం లో ప్రవాహం కంటే లోతట్టు గా ఉన్నందున నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుండి మోటార్లద్వారా నీటిని తరలించడం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు కమిషనర్ కు వివరించారు.

నగరంలో భారీ వర్షాలు కురిస్తున్నప్పటికీ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా అ న్ని చర్యలు తీసుకున్నామని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని హిమాయత్ నగర్ స్ట్రీట్ 14 లో ఆదర్శ్ బస్తీ లో నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణంను చేపట్టడం ద్వారా వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.మూడురోజుల పాటు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి తీసుకుంటున్న చర్యల పై ఎప్పటి కప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్షిస్తున్నారని కమిషనర్ తెలిపారు.

వర్ష ప్రభావం ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటల పాటు 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పని చేస్తున్నాయని అంతే కాకుండా 27 డి ఆర్ ఎఫ్ బృందాలు కూడా పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో అప్రమత్తం చేసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News