Sunday, December 22, 2024

అన్ని పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లివ్వాలి : కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజకీయ పార్టీలన్నీ బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల్లో , ప్రతిసారి అన్ని పార్టీలు బిసిలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లను బిసిలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాచిగూడ లో బిసి గర్జనను నిర్వహించనున్నట్లు కృష్ణయ్య తెలిపారు శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని పార్టీలు తమ ఎన్ని కల మేనిఫెస్టోల్లో పార్లమెంట్ లో బిసి బిల్లుకు మద్దతు తెలుపుతూ పొందుపరచాలన్నారు.

బిసి బిల్లు కోసం పోరాడాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బిసిలకు 50 శాతం ఇవ్వకపోతే ఆ పార్టీలను ఓడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ప్రతి ఎన్నికలలో ఇదే నినాదం ఇస్తూ అధికారంలోకి రాగానే పక్కన పెడుతున్నాయని ఆయన విమర్శించారు. బిసి బిల్లుకు శాశ్విత పరిష్కారం చేయాలన్నారు. బిసి అనుకూల వైఖరి తీసుకోక పోతే తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News