Thursday, September 19, 2024

జులై 21న అఖిల పక్ష సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఒకరోజు ముందు జులై 21న(సోమవారం) అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని పక్షాల సభా నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని ప్రభుత్వం అహ్వానించినట్లు వర్గాలు మంళవారం తెలిపాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరైన పక్షంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగే సాంప్రదాయక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అవుతుంది.

కాగా..జులై 21వ తేదీని తమ పార్టీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నందున అఖిల పక్ష సమావేశానికి తాము హారుకాలేమని టిఎంసి తెలియచేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 1993లో పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కాలంలో జులై 21న కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయానికి ఊరేగింపుగా వెళుతున్న కాంగ్రెస్ మద్దతుదారులపై పోలీసులు జరిపిన కాల్పులలో 13 మంది మరణించారు.

మరణించిన 13 మంది కాంగ్రెస్ మద్దతుదారులకు నివాళిగా జులై 21న సంస్మరణ దినాన్ని టిఎంసి పాటిస్తోంది. ఈ కాల్పులు జరిగిన సమయంలో పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. 1998 జనవరి 1న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం జులై 21న అమరవీరుల సంస్మరణార్థం ర్యాలీ నిర్వహిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జులై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగియనున్నాయి. జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News