Saturday, December 21, 2024

24న అఖిల పక్ష భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ఏర్పాటు
25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఆదివారం (24న) సాంప్రదాయక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల దృష్టా’ 24 ఉదయం అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. శీతాకాల సమావేశాలు 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తాయి. రాజ్యాంగం ఆమోదముద్రకు 75వ వార్షికోత్సవం సందర్భంగా సంవిధాన్ సదన్ లేదా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాలులో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శాసనపూర్వక అజెండా గురించి ప్రతిపక్షానికి తెలియజేసేందుకు, పార్లమెంట్‌లో పార్టీలు చర్చను కోరే అంశాలను చర్చించడానికి పార్లమెంట్ సెషన్‌కు ముందు ప్రభుత్వం అఖిల పక్ష భేటీని నిర్వహిస్తుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News