- Advertisement -
పార్లమెంట్ సెషన్‌కు సన్నద్ధం
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం (18వ తేదీన) అఖిలపక్ష భేటీ తలపెట్టింది. ఈ విషయాన్ని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. ఈ నెల 19వ తేదీ నుంచి సెషన్ ఆరంభం అవుతుంది. ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానాలు పంపించారు.
ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. సభా నిర్వహణ సజావుగా ఉండేందుకు అన్ని పార్టీల నేతలతో భేటీ జరపడం ఆనవాయితీగా ఉంది. కేంద్ర మంత్రిమండలిలో కీలక మార్పుల తరువాత జరుగుతున్న పార్లమెంట్ సెషన్‌కు పలు తీవ్రస్థాయి సమస్యల నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సెషన్ ఆగస్టు 13 వరకూ ఉంటుంది.
All-party meeting to be held on July 18
- Advertisement -