మరో వైపు మణిపూర్ హింసపై చర్చ విషయంలో లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మంగళవారం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమ పటువీడలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా, హోంమంత్రి అమిత్ షా చర్చకు సమాధానమిస్తారని ప్రభుత్వంచెప్పినట్లు సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమావేశం అనంతరం విలేఖరులకు చెప్పారు. మణిపూర్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, స్పీకర్ నిర్ణయించే ఏ రోజయినా చర్చించవచ్చనిపార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఆమోదించాల్సిన ముఖ్యమైన బిల్లులు చాలా ఉన్నాయని, చర్చ లేకుండా అవి ఆమోదం పొందడం తమకు ఇష్టం లేదని ఆయన అంటూ చర్చలో పాల్గొనాల్సిందిగా చేతులు జోడించి ప్రతిపక్షాలను కోరామని చెప్పారు.