Friday, December 20, 2024

పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలందరూ క్షేమంగా ఉంటారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో సోమవారం నూతన ఏసిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్పాటు చేసిన 32 సిసి కెమెరాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ పటిష్ట భద్రత, కమాండ్ కంట్రోల్ వంటి ఆధునిక పోలీస్ వ్యవస్థ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఆయన అన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 9 పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బాలానగర్ జోన్ డిసిపి సందీప్, మేడ్చల్ డివిజన్ ఏసిపి వెంకట్ రెడ్డి, మెడ్చల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జడ్పిటిసి శైలజ విజయనంద్ రెడ్డి, మేడ్చల్ ఎంపిపి రజిత రాజమల్లా రెడ్డి, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీల చైర్ పర్సన్లు మర్రి దీపిక నర్సింహా రెడ్డి, మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, స్ధానిక బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News