Sunday, November 17, 2024

ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • వాడ వాడల బోనాల జాతర పండుగ ఉత్సవం
  • తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐదవ వార్డులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో జరుగుతున్న బోనాల జాతరకు హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోనాల పండుగ పెద్దగా తెలంగాణ ప్రజలు ఎంతో సంప్రదాయంగా గోప్పగా ఈ ఆషాడ మాసంలో జరుపుకునే పండుగ అన్నారు. ఈ పండుగ తమ సంప్రదాయ పద్ధతిలో అక్క చెల్లెల్లు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పించాలని అమ్మవారిని ప్రార్ధిస్తుంటామన్నారు.

ఆషాడ మాసం పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు అద్దం పట్టినట్లు సిద్దిపేట పట్టణంలోని బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుబిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎంత చదివినా, దేశ విదేశాలకు వెళ్లినా మన ఆచారా వ్యవహారాలు, సంప్రదాయాలను బావితరాలకు అందజేసే విధంగా అందరూ కలిసి కట్టుగా ఈ సంప్రదాయం నిలబెట్టడానికి కొనసాగించడానికి కృషి చేయాలన్నారు. పట్టణంలోని వాడ వాడల పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు గ్రామ దేవత అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. ప్రతి ఆలయం వద్ద డప్పు, చప్పుళ్లు దరువుల నడుమ మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీశ్‌రావు

పట్టణంలోని 39వ వార్డు పరిధిలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పైసా రామకృష్ణ తనయుడు ఇటీవల గుండె పోటుతో మృతి చెందాడు. మంత్రి హరీశ్‌రావు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అదే విధంగా పట్టణంలోని భారత్ నగర్‌లో సత్యసాయి సమితి మెంబర్ చీకోటి విశ్వనాథ్ ఇటివల మృతి చెందాడు. ఈ మేరకు వారి కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News