Thursday, January 23, 2025

అమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • బోనాల సంబరాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రజాప్రతినిధులు

శివ్వంపేట: శివ్వంపేటలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆషాడ మాసం చివరి రోజు కావడంతో మండలంలో ప లు గ్రామాల్లో పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ దేవత అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాలను రంగులతో అలంకరించి విద్యుత్ కాంతులతో సౌండ్ సిస్టంతో ఆలయ ప్రాంగణమంతా పండగ వాతావరణం కల్పించారు. ప్రతి ఏటా జరుపుకున్నట్టే ఉదయం నుంచే అమ్మవారికి దర్శనానికి భక్తులు పో టెత్తారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దు స్తులు ధరించి బోనాలను అలంకరించుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుతో ర్యాలీగా డప్పు వాయిద్యాలతో పోతరాజుల విన్యాసాలతో ఒకరి వెంట ఒకరు చూడముచ్చటగా బోనాలతో వచ్చి అమ్మవారి కి సమర్పించారు.

దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణ లు చేసే నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. కొందరు మొక్కులు ఉన్నవారు బోనాలతో పాటు కోళ్ల లో అమ్మవారి గుడి ముందు కోశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆడపడుచులు అమ్మవారి ఇంటికి రావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపారు. అనంతరం సాయంత్రం భక్తులు పలహారంబండ్లుతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీ ర్చుకున్నారు. ఆయా గ్రామాలలో సర్పంచులు, ఎంపిటిసిలో, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని బో నాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవలలో భాగంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి బోనం ఎత్తుకొన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పబ్బ మహేష్, ఎంపిపి కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మండల సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, సర్పంచులు, పత్రాల శ్రీనివాస్ గౌడ్, కీర్తన హనుమంతరావు, స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్ , ఎంపిటిసిలు నరసింహారెడ్డి, సులోచన ధర్మారెడ్డి పార్టీ అధ్యక్షుడు రమణగౌడ్, బిఆర్‌ఎస్వి అధ్యక్షులు సుధీర్ రెడ్డి,వాకిటి శశిధర్ రెడ్డి ఉప సర్పంచులు పద్మ వెంకటేష్, నవీన్, కాముని శ్రీనివాస్, నాయకులు బి.రామాగౌడ్, కొండల్ పోచగౌడ్, ఆయా గ్రామాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్‌ఐ రవి కాంతారావు పోలీస్ సిబ్బందితో ఆలయాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News