Thursday, January 23, 2025

పోచమ్మతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: పోచమ్మ తల్లి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో ఆదివారం నిర్వహించిన వరాల పోచమ్మ, అచ్చుబండ పోచమ్మ బోనాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని పోచమ్మ ఆలయాలకు తరలివెళ్లారు.

శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అలరించగా, ఎమ్మెల్యే నెత్తిన బోనమెత్తుకుని మహిళలతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయూరారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు సురేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News