Wednesday, January 22, 2025

అమ్మవారి కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: అమ్మవారి కరుణ దయ కటాక్షలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమ్మవారిని వేడుకున్నారు. గురువారం పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ పట్టణంలోని పలు ఆలయాల్లోని అమ్మవార్లను మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాల పండుగలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

నియోజకవర్గవ్యాప్తంగా పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరో సారి పూర్తి మెజార్టీతో గెలుపించాలని అమ్మవారిని కోరుకున్నారు. వర్షాలు బాగా కురిసి వ్యవసాయ దారులకు మంచి పంటలు పండించాలని అమ్మనారిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News