వైరా : వైరా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆధ్యాత్మిక దినో త్సవం సందర్భంగా వైరాలోని శ్రీ కోదండ రామాలయ ఆలయ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏయంసి చైర్మన్ రత్నం, ఎంపిపి వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, జడ్పీకో ఆప్సన్ మెంబర్ షేక్ లాల్ ఆహ్మద్, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, వైరా నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి, కౌన్సిలర్‌లు డాక్టర్ కోటయ్య, వనమా విశ్వేశ్వరరావు, మండలాధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి, సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సక్కుబాయి, తాటిపల్లి సుధీర్, ఫనితి సురేష్ తదితరులు పాల్గొన్నారు.