కేంద్ర విద్యాశాఖ మంత్రి పిలుపు
న్యూఢిల్లీ: పాఠశాల విద్యకు సంబంధించిన నూతన జాతీయ పాఠ్యప్రణాళిక స్వరూపం(ఎన్‌సిఎఫ్) రూపకల్పన కోసం ఎన్‌సిఇఆర్‌టి నిర్వహిస్తున్న పౌర సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం పిలుపునిచ్చారు. దేశంలో పాఠశాల విద్యకు చెందిన సిలబస్, పాఠ్యపుస్తకాలు, బోధనాల పద్ధతులను రూపొందిచడానికి ఎన్‌సిఎఫ్ ఒక మార్గదర్శకంగా ఉపయోగపడనున్నది. ఎన్‌సిఇఆర్‌టి నిర్వహించనున్న ఈ డిజిటల్ సర్వేలో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఐదు ఆప్షన్లు ఉంటాయి. భావితరాలకు ఉపయోగేపడే విధంగా విద్యను ఎలా రూపొందించాలి, నైపుణ్యతను విద్యలో ఎలా పొందుపరిచాలి, ఉపాధ్యాయుల గౌరవాన్ని ఎలా పెంపొందించాలి వంటి ప్రశ్నలు ఈ సర్వేలో ఉంటాయి. నయీ భారత్‌కా నయా కరికులమ్ రూపొందించడానికి ప్రజలందరూ ఎన్‌సిఎఫ్‌కు చెందిన సర్వేలో ప్రజలందరూ పాల్గొనాలని ప్రధాన్ ఒక ట్వీట్‌లో కోరారు.