సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 1వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులంతా సమన్వయంతో పని చేయాలనీ ఆయన ఆదేశించారు. మంగళవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని శంకర్‌జి ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారుల స మన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో 173 పరీక్షా కేంద్రాలలో 59,604 మంది అభ్యర్థులు పరీక్షా వ్రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షా రెండు సెషన్లలో జరుగుతుందని, పేపర్ -1 పరీక్షా ఉదయం 10 .00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంట వరకు, పేపర్ -11 మధ్యాహ్నం 2.30 గంటల నుండి సా యంత్రం 5.00 గంట వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలన్నారు. పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగా శానిటైజ్ చేయాలనీ సంబంధిత అధికారులను అదేశించారు. అభ్యర్థులు హాల్ టికెట్లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని, ఉదయం 8 .00 నుండి 9 .45 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 నుండి 2.15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తారని తెలిపారు.
మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, వాచీలు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, వల్లెట్స్, మొదలైనవి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మంచినీరుతో పా టు ఆరోగ్య శాఖ ఏ ఎన్ ఎమ్ ఉంచి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలని, .పరీక్షా కేంద్రాల భారీ భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు సూచించా రు. వెన్యూ సూపర్‌వైజర్లు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్ ను అందుబాటులో ఉంచి అభ్యర్థులను శానిటైజ్ చేయాలన్నారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండాచర్యలు తీసుకు కోవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతో పాటు 173 మంది లోకల్ ఇన్స్‌ఫేక్షన్ ఆఫీసర్లు ఉంటారని, మరో 48 మంది రూట్ ఆఫీసర్లను నియమించినట్లు వెల్లడించారు. డిప్యూటీ కమీషనర్ బాబు రావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు గతంలో లాగా ఇంటర్నెట్ కేంద్రాలను మూసి ఉంటాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను ఫ్రిస్కింగ్ చేయడానికి ముగ్గురు మగ పోలీసులు ఇద్దరు లేడి పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారి సూ ర్యలత, అలెక్స్ సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.