Thursday, December 19, 2024

గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో (నవంబర్ 17,18) జరుగనున్న గ్రూప్3 పరీక్షల నిర్వహణకు తె లంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు ప కడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇటీవల సిఎస్ శాంతికుమారి జి ల్లా కలెక్టర్లు, ఎస్‌పిలకు ఆదేశించి న విషయం తెలిసిందే. గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టిజిపిఎస్‌సి ఇటీవల వి డుదల చేసింది. రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనుండగా.. ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 3 గంట ల నుంచి సాయంత్రం 5.30 గం టల వరకు పేపర్2 నిర్వహించనున్నారు. పరీక్ష మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యా హ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉద యం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గం టలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత అభ్యర్థులు పరీక్షా కేంద్రా ల్లో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు.

అభ్యర్థులు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని భద్రంగా పె ట్టుకోవాలని, తొలిరోజు పేపర్1 పరీక్షకు హాజరైన హాల్ టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను ని యామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది. రాష్ట్రంలో దాదా పు 1380 గ్రూప్-3 పోస్టులకు 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకు న్న విషయం తెలిసిందే. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పనిదినాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040 23542185 లేదా 040 23542187 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని లేదా Helpdesk@tspsc.gov.inకు ఈమెయిల్ చేయాలి. దాంతో పాటు అభ్యర్థుల సౌకర్యార్థం టిజిపిఎస్‌సి జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నెంబర్లను విడుదల చేసింది. టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నెంబర్లను చూడవచ్చు.

పరీక్షా విధానం ఇదే..
గ్రూప్- 3 పరీక్షలో మెుత్తం మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఈ మూడు పేపర్లకు కలిపి 450 మార్కులు ఉంటాయి. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఒక్కో పేపర్ రాసేందుకు రెండన్నర గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఒక ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలు మూడు భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. గ్రూప్ -3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు ఉద్యోగం సాధిస్తారు.ఈ పరీక్షలో జనరల్ నాల్జెడ్, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News