Friday, December 20, 2024

గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

నిర్మల్  : నిర్మల్ జిల్లాలో నేడు జరిగే గ్రూప్ 4 పరీక్షను సంబంధిత అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్‌లో 31 , ఖానాపూర్‌లో 6 , భైంసాలో 17 కేంద్రాల చొప్పున మొత్తం 54 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షకు మొత్తం 15474 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్ష రెండు పేపర్లు ఉంటాయని మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం 12 ః 30 గంటల వరకు, జనరల్ స్టడీ పేపర్ మధ్యాహ్నాం 2 ః 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సెక్రెటేరియట్ ఎబిలిటి పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.

అభ్యర్థులు పరీక్ష సమాయానికి గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని తెలిపారు. ప్రతీ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాలను భద్రపర్చడం ,తిరిగి సెంటర్లకు తరలించే క్రమంలో భారీ బందోబస్తూ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయడంతో పాటు 300 మీటర్ల దూరంలో 114 సెక్షన్ అమలుల్లో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు గుర్తించిన ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి , ఎంప్లాయ్ ఐడిలలో ఏదైన ఒకదానిని అభ్యర్థులు తమ వెంట తీసుకు రావాలన్నారు. సెల్ ఫోన్, షూస్, బ్లూ లేదా, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే అభ్యర్థుల పేరు, కేంద్రం కో డు, హాల్ టికెట్ నెంబర్లను రాయాలన్నారు. పోలీస్ సిబ్బంది సైతం ప్రతీ సెంటర్ దగ్గర అప్రమత్తంగా ఉండి భారీ బం దోబ స్తూ గావించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News