Monday, January 20, 2025

గ్రూప్-1 పరీక్షల నిర్వహణ కోసం సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

జనగామ ఎడ్యుకేషన్ : గ్రూప్-1 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య తెలిపారు. శనివారం సాయంత్రం జనగామ పట్టణంలోని సెయింట్‌పాల్స్, సాంఘీక సంక్షేమ పాఠశాల, ఏబీవీ జూనియర్ కళాశాల, ఏకశిల పబ్లిక్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్‌సింగ్‌తో కలిసి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం జనగామ బస్టాండ్ కూడలిలో హెల్ఫ్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వివరాలు అక్కడ తెలుసుకోవచ్చని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలకు వెళ్లే దారిలో విషయ సూచిక బ్యానర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక జిల్లా స్థాయి అధికారిణి నియమించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆయనవెంట మున్సిపల్ కమిషనర్ రజిత, రూట్ ఆఫీసర్లు రవిందర్, అన్వర్, పూల్‌సింగ్, సంబంధిత శాఖల సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News