అడ్డాకుల : మండల పరిధిలో కాటవరం స్టేజి కృష్ణానగర్ కాలనీ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పిటిసి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు యూత్ గ్రామాల యువకులు, అందరూ వచ్చి ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధ్ది సాధించిందని కొనియాడారు. సిఎం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలియజేశారు. అవకాశాలు అందరికి వస్తాయని నియోజకవర్గ సీనియర్ నాయకులు, యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువకులు కలిసికట్టుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు యువకులు , కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అభివృద్ధ్ది సంక్షేమానికి ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో యువకులు యువజన ఆత్మీయ సమ్మేళన సభలో జడ్పిటిసి, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 150 మంది యువకులు కాంగ్రెస్,బిజెపికి చెందిన వారు చేరారన్నారు. పార్టీలో వచ్చిన వారిని యువకులను అందరిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆహ్వనించారు.
అనంతరం ఎమ్మెల్యే యువకులకు భోజనాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మంజుల భీమన్నయాదవ్, ఎంపీటీసీ రంగన్నగౌడ్, సింగిల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కో ఆప్షన్ ఖాజా గోరి, సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు బాలరాజు, గ్రామ అధ్యక్షుడు డి. శ్రీనివాసులు, యూత్ గ్రామ అధ్యక్షుడు మహేష్ యాదవ్, వడ్డీ శ్రీరాములు, యువకులు తదితరులు పాల్గొన్నారు.