Wednesday, January 22, 2025

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారికి సమాన ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని రంగాల్లో వారికి ఆర్థిక చేయూతనందించి అభివృద్ధి చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో క్రైస్తువుల కోసం ఏర్పాటు చేసిన స మాదుల తోటను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్ని మతాల వారిని ఆదరించి వారి అభివృద్ధ్ది కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుచేసి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.

శాంతి , కరుణ, ప్రేమ, సేవ అన్న జీసస్ బోధనలతో ప్రంపంచం శాంతియుతంగా ఉండాలని కుల మత బేధాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాదించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా 12 వేల గ్రామపంచాయతీలలో వైకుంఠ ధామాలు నిర్మించి చివరి మజిలీ ప్రశాంతంగా జరపటానికి కృషిచేస్తున్నామన్నారు.

క్రిస్టియన్ మైనార్టీల ఆత్మగౌరవం పెంపొందించాలాని 2 ఎకరాల స్థలంలో రూ.10 కోట్లతో ఉప్పల్ భగాయత్ క్రిష్టియన్ భవనం నిర్మిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో కుడా క్రిష్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ రూ. 20 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖాభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని క్రిస్మస్ వేడకలలో సోదర సోదరీ మణులకు క్రిస్మస్ గిప్టులు అందించి సామరస్యాన్ని చాటుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు కార్తీక్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News