Wednesday, January 22, 2025

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం జరగలేదు

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వల్లే తెలంగాణ ఏర్పడిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న జైరాం రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 శాతం నిరుద్యోగం ఉంటే తెలంగాణలో 15 శాతం నిరుద్యోగం ఉందన్నారు.

యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంది తెలంగాణలోనేనని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా కలలు కన్న సామాజిక తెలంగాణ రాలేదని ఆయన విమర్శించారు. నవంబర్ 30వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News