Sunday, December 22, 2024

గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం.. 3,600 సిసి కెమెరాలతో నిఘా

- Advertisement -
- Advertisement -

నగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు(గురువారం) గణేష్ నిమజ్జనం సందర్భంగా మహానగరంలో 3,600 సిసి కెమెరాలను అనుసంధానించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు మరో 100 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో 40 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇక, ఆర్ఏఎఫ్, పారా మిలటరీ, అదనపు బలగాలు కూడా బందోబస్తులో పాల్గొనున్నారు. గణేష్ నిమజ్జనాన్ని కమాండ్ కంట్రోల్ నుంచి సిపి సివి ఆనంద్, ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News