Saturday, February 8, 2025

స్థానిక సమరానికి సమాయత్తం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసి ఎ న్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇంతర సిబ్బందికి ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. ఈనెల 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పిఒ, ఎపిఒలకు శిక్షణ ఇవ్వనుండ గా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాల ని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీకాలం జులైలో ముగుస్తున్న నేపథ్యంలో

ఈ నెల 10వ తేదీన ఓటరు జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఎంపిడిఒలు,అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు ఈ నెల 11న పోలింగ్ స్టేషన్ల జాబితా రూపొందించి,13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రచురించాలని అన్నారు. ముందుగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News